ఆమ్‌చూర్‌@రూ.27,800 | - | Sakshi
Sakshi News home page

ఆమ్‌చూర్‌@రూ.27,800

May 3 2026 8:17 AM | Updated on May 3 2026 8:17 AM

ఆమ్‌చూర్‌ క్రయవిక్రయాలకు పేరొందిన నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పంట దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో శనివారం క్వింటాల్‌ ధర రూ.27,800 పలికింది. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత నిజామాబాద్‌లోనే ఆమ్‌చూర్‌ కొనుగోళ్లు జరుగుతాయి. మహబూబ్‌నగర్‌, నల్గొండ, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ నుంచి మొత్తం 267 క్వింటాళ్ల ఆమ్‌చూర్‌ నిజామాబాద్‌ మార్కెట్‌కు వచ్చింది. పుష్కలమైన విటమిన్లు ఉండే ఆమ్‌చూర్‌ను ఎక్కువగా ఉత్తరభారతీయులు వాడుతారు. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement