● ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి
ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాము లు కావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి పి లుపునిచ్చారు. పట్టణ శివారులోని సప్తగిరి ఫంక్షన్ హాల్‌లో శనివారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గస్థా యి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎ మ్మెల్యే రాకేష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. నియోజవర్గంలో పలు అభివృద్ధి పనులను మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారులు ప్రజలకు అన్ని విధాల సహకరించాలంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసి పెట్టాలన్నారు. సర్పంచ్‌లు తమ గ్రామాల్లోని పాఠశాలల్లో మరమ్మతులతో పాటు, అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. అనంతరం పలువురు ల బ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల ను అందజేశారు. సభాస్థలిలో ఏర్పాటు చేసిన వివిధ పథకాల స్టాళ్లను పరిశీలించారు. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి రఘు, తహసీల్దార్ సత్యనారాయణ, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంవీఐ రాహుల్ కుమార్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.


