● గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ధర్మోరా గ్రామస్తులు
మాక్లూర్: తమ గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లకు ప్రవేశం లేదంటూ ధర్మోరా గ్రామస్తులు పేర్కొన్నా రు. ఈమేరకు మండలంలోని ధర్మోరా గ్రామంలో ఆదివారం గ్రామస్తులందరు కలిసి సర్పంచ్ పందిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మా ఊరిలోనికి ఐస్‌క్రీం అటోలకు ప్రవేశం లేదని గ్రామానికి రెండు వైపులా ఫ్లెక్సీలు పెట్టారు. అటోలలో వచ్చి నాసిరకం ఐస్‌క్రీంలు అమ్మడంతో వాటిని తిన్న చిన్నారుల ఆరోగ్యాలు చెడిపోతున్నాయన్న ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఎవరైన గ్రామంలోకి వచ్చి ఐస్‌క్రీంలు విక్రయిస్తే రూ.5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అనంతరం ఐస్‌క్రీంలు తింటే చిన్న పిల్లలకు వచ్చే జబ్బుల విషయమై గ్రామంలో అవగాహన కల్పించారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


