తగ్గితే బెటర్
రోడ్ టెర్రర్..
● పెరుగుతున్న ప్రమాదాలు
● నిర్లక్ష్యంతోనే ప్రాణాలు హరీ
● బోధన్ రోడ్ ప్రమాదాల్లో 19 మంది మృతి
● రాష్ట్రంలో 20వ స్థానం
● రూ. 2 కోట్ల లావాదేవీలు
● క్రిస్మస్ ప్రభావంతో జోరుగా కొనుగోళ్లు
జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ వరకు జిల్లాలో 612 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 231 మంది ప్రాణాలు కోల్పోయారు. 445 మంది గాయాలపాలయ్యారు. జాతీయ రహదారుల వెంబడి 236 ప్రమాదాలు జరగగా, 309 మంది ప్రాణాలు పోయాయి. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగర శివారులోని బోధన్ రోడ్డులో గత మూడు సంవత్సరాల్లో ఒకే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు 19 మంది ఆయువు తీశాయి. ఈ ప్రాంతం రాష్ట్రంలోనే అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకోవడంలో 20వ స్థానంలో నిలిచింది.
నిర్లక్ష్య వైఖరితోనే..
రోడ్డు ప్రమాదాలకు వాహనదారుల నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణంగా నిలుస్తోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు మూలమలుపులు సైతం పలుచోట్ల రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. రోడ్డు భద్రత నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్‌లో వెళ్లడం, వాహనాల ఓవర్ టేక్‌లతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు. ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జక్రాన్‌పల్లి మండలం పడకల్ వద్ద ట్రాక్టర్‌ను కంటైనర్ వెనకాల నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని జాతీయ రహదారి వెంబడి డిచ్‌పల్లి సీఎంసీ, ఇందల్వాయి గన్నారం, పెర్కిట్, బాల్కొండ చిట్టాపూర్ , జక్రాన్‌పల్లి మండలం పడకల్, డిచ్‌పల్లి పోలీస్ బెటాలియన్ తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితోపాటు బోధన్–నిజామాబాద్, నిజామాబాద్– నందిపేట్, నిజామాబాద్–మల్లారం గండి, ఆర్మూర్–నిజామాబాద్ రహదారుల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
నవీపేట: నవీపేట మండల కేంద్రంలో శనివారం మేకల సంత వ్యాపారులు, కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. గత వారంతో పోల్చితే ఈ వారం క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. ఈ నెల 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా విక్రయాలు పెరిగాయి. దీంతో జీవాల ధరలను వ్యాపారులు ఒక్కసారిగా పెంచేశారు. ఒక్కో మేక ధర రూ. 8 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు. శనివారం నాటి సంతలో రూ. 2 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
కిక్కిరిసిన మేకల సంత
రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. అవి క్షేత్రస్థాయిలో ఫలితాలివ్వడం లేదని చెప్పవచ్చు. ఆర్టీసీ, పోలీస్ శాఖ ప్రతి ఆరు నెలలకోసారి అవగాహన కార్యక్రమా లు నిర్వహిస్తున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లకు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలను తెలియజేస్తున్నారు. వీటితోపాటు ప్రజలకు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్ ధరించేలా వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నా మార్పు కనిపించడం లేదు.
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 8 సొసైటీల ఏర్పాటుకు అవకాశం
నందిపేట, పాల్వంచ మండల కేంద్రాల్లో ఏర్పాటుపై ఇప్పటికే నిర్ణయం
సహకార సంఘాలు, డీసీసీబీ పదవులు నామినేట్ చేస్తారనే చర్చ
గత 22 నెలల్లో రూ.1,300 కోట్ల నుంచి రూ.2,700 కోట్లకు పెరిగిన టర్నోవర్
తగ్గితే బెటర్


