ఎన్‌డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జీగా బాధ్యతలు స్వీకరణ
సుభాష్‌నగర్: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) పర్సన్ ఇన్‌చార్జీగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీ పాలకవర్గాలను రద్దు చేస్తూ పర్సన్ ఇన్‌చార్జీగా కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్ర భుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తె లిసిందే. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ను సీఈవో నాగభూషణం వందే పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్‌డీసీసీబీ కార్యకలాపాలపై సీఈవోను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీజీఎం లింబాద్రి తదితరులు ఉన్నారు.
సులభ బోధనకు
గణిత ల్యాబ్ దోహదం
బోధన్: గణిత శాస్త్ర పాఠ్యాంశాలను సుల భంగా, ఆసక్తికరంగా విద్యార్థులకు బోధించేందుకు గణిత ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని ఆ జాంగంజ్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన గణిత శాస్త్ర బోధన–అభ్యసన ల్యాబ్‌ను డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వి విధ గణిత నమూనాలు, బోధన పద్ధతులకు సంబంధించిన చార్టులను ప్రదర్శించారు. ప్రయోగాత్మకంగా పాఠ్యంశాలను బోధించడంతో విద్యార్థుల్లో ఆలోచన శక్తి, విశ్లేషణ సామర్థ్యాలు మరింత పెరుగుతాయని పే ర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో నాగ య్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.
రూ.278.23 కోట్ల బోనస్ చెల్లింపు
● డీఎస్‌వో అరవింద్‌రెడ్డి
సుభాష్‌నగర్: జిల్లాలో వానాకాలం సీజన్‌లో ప్రభుత్వ కొ నుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు రూ.278.23 కోట్ల బోనస్ డబ్బులను ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి అరవింద్‌రెడ్డి శనివారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 96,719 మంది రైతుల నుంచి 59,84,620 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే 87,218 మంది రైతులకు 55,64,649 క్వింటాళ్లకు బోనస్ డబ్బులు చెల్లించామన్నారు. ఇంకా 4,19,971 క్వింటాళ్లకు సంబంధించి రూ.21 కోట్ల బోనస్ డబ్బులు రైతులకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ప్రతి రైతుకూ బోనస్ జమ అవుతుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అరవింద్‌రెడ్డి తెలిపారు.
కొడుకును విక్రయించిన తల్లిదండ్రులు
నిజామాబాద్‌అర్బన్: తొమ్మిది నెలల కొడు కును తల్లిదండ్రులు విక్రయించిన ఘటన నగరంలో శనివారం చోటు చేసుకుంది. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన సీ మ, షరీఫ్ దంపతులు రైల్వేస్టేషన్‌లో భిక్షాటన చేసేవారు. అయితే, డబ్బుల కోసం సొంత కుమారుడిని రూ. లక్షా 20 వేలకు వి క్రయించారు. విషయం తెలుసుకున్న జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టగా, బాలుడిని విక్రయించినట్లు తల్లి దండ్రులు ఒప్పుకున్నారు. ఐసీడీఎస్ ఉద్యో గి సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, బాలుడిని నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ఎన్‌డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జీగా బాధ్యతలు స్వీకరణ
ఎన్‌డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జీగా బాధ్యతలు స్వీకరణ


