ఆరున్నర దశాబ్దాల నాటి ఆనందం
65 ఏళ్ల క్రితం నాటి స్కూల్ అటెన్‌డెన్స్ రిజిస్టర్‌లో తన పేరును చూసుకున్న ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆనందంతో పొంగిపోయారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడి గదిలోకి వెళ్లి కూర్చున్నారు. తాను ఇదే పాఠశాలలో చదివానని హెచ్‌ఎం నరహరితో చెప్పగా.. ఏ సంవత్సరంలో చదివారని ఆరా తీసి నాటి అటెన్‌డెన్స్ రిజిస్టర్‌ను తీయించారు. 1960 నాటి ఆరో తరగతి రిజిస్టర్‌లో తన పేరును చూసుకున్న పోచారం సంతోషం వ్యక్తం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అక్కడి వారితో పంచుకున్నారు. – బాన్సువాడ
ఆరున్నర దశాబ్దాల నాటి ఆనందం


