ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం అంటే..
ఎల్లారెడ్డి: ఎన్నికలలో పలువురు అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారన్న వార్తలు మనం చూస్తుంటాం. అసలు డిపాజిట్ దక్కడం అంటే.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు కొంత డబ్బును డిపాజిట్‌గా జమచేస్తారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థికి ఎన్నికలలో పోలైన ఓట్లలో 16 శాతం లేదా అంతకు మించి ఓట్లు సాధించాలి. దీన్నే అభ్యర్థికి డిపాజిట్ దక్కడం అంటాం. ఒకవేళ అంతకన్నా తక్కువ ఓట్లు సాధిస్తే సదరు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినట్లు పేర్కొంటారు. డిపాజిట్ దక్కిన అభ్యర్థికి వారు నామినేషన్ సమయంలో జమచేసిన డిపాజిట్ డబ్బులను తిరిగి ఇస్తారు. డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థుల డబ్బులు ఎన్నికల కమిషన్ ఖాతాల్లోకి వెళతాయి.


