నేలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
నివారణ చర్యలు..
● పంటల సాగులో నేల పాత్ర కీలకం
● నేడు ప్రపంచ మృత్తిక దినోత్సవం
రుద్రూర్: నేలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పంటల సాగులో నేల పాత్ర కీలకమని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డా.కె. పవన్ చంద్రరెడ్డి అన్నారు. నేడు (డిసెంబర్ 5) ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా నేల ప్రాముఖ్యత, సంరక్షరణ గూర్చి ఒక ప్రకటనలో ఆయన వివరించారు.
మనుషులకు, పశుపక్ష్యాదుల జీవనానికి అవ సరమైన ఆహారాన్ని నేల అందిస్తుంది. వివిధ కారణాల వల్ల నేలలు నిస్సారమవుతున్నాయి. నేలల ను సంరక్షించాల్సిన ఆవశ్యకతను గుర్తించి ప్రతి ఏ డాది డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి ఎఫ్‌ఏవో ఆరోగ్యకరమైన ‘నేలలు–ఆరోగ్యకరమైన నగరాలు’ అనే అంశాన్ని ప్రకటించిందని ఆయన తెలిపారు. ఈ అంశం ద్వారా పట్టణాల్లో జరిగే నగరీకరణ, భవనాల నిర్మాణం, రోడ్లు వల్ల నేల గట్టిపడటం, నేల రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలతో నేల ఆరోగ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నారు.
వ్యవసాయంలో..
నేల పైర్ల ఎదుగుదలకి అవసరమైన నీరు, గాలి, పో షకాలను, అందజేస్తుంది. నేలలో ఉండే సూక్ష్మజీవులు పంటలకు అవసరమైన పోషకాలను విడుద ల చేస్తాయి. వర్షపు నీటిని నిల్వచేసి పంటలకు అందిస్తుంది.నేలలో జీవపదార్థం ఎక్కువగా ఉంటే కా ర్బన్ నిల్వఅవుతుంది. పైర్లపై ఆశించే చీడపీడలను తెగుళ్లను తగ్గిస్తుంది. ఆరోగ్యమైన నేల వల్ల పైర్ల దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. వర్షపు నీటిని శోషించి భూగర్భ జలాలను పెంపొందిస్తాయి.
నేల క్షీణతకు ప్రధాన కారణాలు:
నేల క్షయం (నీరు, గాలితో మట్టి తొలగిపోవడం), అడవుల నరికివేత, ఎక్కువగా పశువుల మేపడం. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం. రసాయనాలను అధికంగా వినియోగించడం. యంత్రాల వల్ల నేల గట్టిపడటం, లవణీకరణ (ఉప్పు పెరగడం), నీటిముంపు. జీవవైవిధ్యం తగ్గడం.
వివిధ రకాల సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులను విరివిగా వాడాలి. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలి. వైవిధ్యమైన పంటల సాగు, పంట మార్పిడి చేయాలి. నేలను కప్పివుంచే పంటలు వేయడం, సమర్థవంతమైన, సమతుల్య (భూసార పరీక్షా ఫలితాల ఆధారిత)ఎరువుల వినియోగం అవసరం. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటి పొదుపు పద్ధతులు అవలంబించడం వల్ల నేల ఆరోగాన్ని మెరుగు పర్చవచ్చు.


