మండల ప్రభుత్వ కార్యాలయాలు– అధికారులు
మీకు తెలుసా..
రామారెడ్డి: ఒక మండలంలో సాధారణంగా ఉండే ప్రధాన కార్యాలయాలు, అధికారులు మండల కేంద్రంలోనే ఉంటాయి.
● ఒక మండలంలో ఎంతమంది అధికారులు, సిబ్బంది ఉంటారనేది ఆ మండలం పరిమాణం, జనాభా, ప్రభుత్వ నిర్ణయాలు పని భారాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
● మండలం ప్రధాన పాలనాకేంద్రాలు మండల రెవెన్యూ కార్యాలయం (తహసీల్ కార్యాలయం), మండల ప్రజా పరిషత్ కార్యాలయం (ఎంపీడీవో కార్యాలయం).
● ప్రధానంగా మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో కలిపి ఒక మండలానికి సంబంధించిన కీలక అధికారులు సిబ్బంది నియమించబడతారు.
● తహసీల్ కార్యాలయం: ఇది రెవెన్యూ పాలన, భూరికార్డులు, పౌర సరఫరాలు, సామాజిక సంక్షేమ పథకాలు (పెన్షన్లు వంటివి), ఎన్నికల నిర్వహణ వంటి అంశాలను చూసుకుంటుంది. అధికారిగా తహసీల్దార్ ఉంటారు.
● డిప్యూటీ తహశీల్దార్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ ) తనిఖీలు, విచారణలు నిర్వహించడంలో తహసీల్దార్‌కి సహకరిస్తారు.
● జూనియర్ అసిస్టెంట్లు/రికార్డ్ అసిస్టెంట్లు/ఇతర సిబ్బంది.
● గ్రామ స్థాయిలో రెవెన్యూ పనుల కోసం గ్రామ రెవెన్యూ అధికారులు (జీపీవో)లను కాంగ్రెస్ సర్కార్ ఇటివల నియమించింది..
● ఎంపీడీవో కార్యాలయం: ఇది స్థానిక సంస్థల (పంచాయతీ రాజ్) పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది.
● మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఈయన మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి అధిపతి. మండలంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు.
● మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) గ్రామ పంచాయతీల పాలనా వ్యవహారాలలో ఎంపీడీవోకు సహకరిస్తారు.
● వ్యవసాయం, విద్య, వైద్యం ఇతర ముఖ్యమైన విభాగాలకు మండల కార్యాలయాలుంటాయి,
● మండల విద్యాశాఖ కార్యాలయం, మండల విద్యాధికారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
● ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో ఉంటుంది.
● విద్యుత్ ఉప కేంద్రం/ట్రాన్స్‌కో కార్యాలయం, విద్యుత్ ఇంజినీరింగ్ (ఏఈ) సిబ్బందితో ఉంటుంది.
● వ్యవసాయ శాఖ కార్యాలయం మండల వ్యవసాయాధికారి పరిధిలో ఉంటుంది.
● పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ లేదా సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుంది.
● పోస్ట్ ఆఫీస్ (తపాలా కార్యాలయం), సబ్ ట్రెజరీ కార్యాలయం (కొన్ని ముఖ్యమైన మండలాల్లో) ఉంటాయి.


