తెయూలో ‘మహిళల కథలు –వికాసం, వైవిధ్యం’పై సదస్సు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం సాహిత్య అకాడమీ, తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ మహిళల కథలు –వికాసం, విస్తృతి, వైవిధ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. నిర్వాహకులు చంద్రశేఖర రాజు స్వాగతోపన్యాసం చేయగా, తెయూ ఆర్ట్స్ కళాశాల డీన్ కరిమిండ్ల లావణ్య ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఆమె రచించిన సాహితీ కిరణాలు (విమర్శన వ్యాసాలు అనే సంపుటి)ను సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు ఎస్‌వీ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ మూలాలు తెలంగి, తెలుగు నుంచి వచ్చాయని తెలిపారు.
ప్రముఖ రచయిత్రి, విమర్శకులు ఆచార్య ముదిగంటి సుజాతారెడ్డి. ఆచార్యులు కనకయ్య, లక్ష్మణ చక్రవర్తి, వంగరి త్రివేణి, సంధ్యారాణి, రజిని, వెల్దండి శ్రీధర్, దేవేంద్ర మాట్లాడా రు. తెయూ విద్యార్థులు, తెలుగు భాషోపాధ్యాయులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.


