విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శనివారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఉదయం పాఠశాల స్థాయి విద్యార్థులకు ‘ఉగ్రవాదం పై భారత్ పోరు‘ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. పైస్థాయి విద్యార్థులకు మధ్యాహ్నం ‘ప్రజాస్వామ్యం, ఎన్నికలు యువత‘ అనే అంశంపై ఉపన్యాస పోటీ నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రొఫెసర్ కుమారస్వామి, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ వీర ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ భుజంగం, లెక్చరర్ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. డిప్యూటీ లైబ్రేరియన్ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ: మండల కేంద్రంలో గల పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి రవికుమార్ శనివారం తనిఖీ చేశారు. తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, మౌలిక వసతులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. బోధన వివరాలపై విద్యార్థులను ప్రశ్నించారు. ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనాథ్, స్థానిక ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
● 32 మందికి జరిమానా
నిజామాబాద్‌అర్బన్: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ 40మంది పట్టుబడ్డారు. వారికి శనివారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ కౌన్సెలింగ్ నిర్వహించి, అనంతరం నగరంలోని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. జడ్జి వారిలో 32 మందికి రూ. 10,000 చొప్పున జరిమానా విధించగా, 8 మందికి వారం రోజుల పాటు జైలుశిక్ష విధించారు.
విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు


