భూభారతి అర్జీలను వేగంగా పరిష్కరించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● జిల్లా అధికారులతో
వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష
నిజామాబాద్‌అర్బన్: భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా దరఖాస్తుల ను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, రెండు రోజుల్లో అర్జీలు పరిష్కారం కావాలని అన్నా రు. చిన్నచిన్న కారణాలతో సాదాబైనామా అర్జీలు తిరస్కరించకూడదని సూచించారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు స్ప ష్టంగా పేర్కొనాలని సూచించారు. కాగా, ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాల మ్యాపింగ్‌ను తప్పిదాలకు తావులేకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


