జాతీయస్థాయిలో రాణించాలి
నిజామాబాద్‌నాగారం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయిలో క్రీడలలో జిల్లా క్రీడాకారులు రాణించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వికారాబాద్‌లో రాష్ట్రస్థా యి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించగా, జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించారు. ఈసందర్భంగా నగరంలోని సుభాష్ నగర్‌లో క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించగా, ఏసీపీ పాల్గొ ని మాట్లాడారు. క్రీడాకారుల ఇదే స్ఫూర్తితో మరిన్ని పతకాలు సాధించాలన్నారు. అనంతరం క్రీడాకారులను సన్మానించారు. డీవైఎస్‌వో పవన్‌కుమార్, స్థానిక స్విమ్మింగ్ పూల్ కోచ్ ఫారుక్ పాల్గొన్నారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు
● వినమ్ర 200 మీటర్ల ఫ్రీ స్టైల్ పందెంలో వ్యక్తిగత రజక పథకం, 400 మీటర్లు ఫ్రీ స్టైల్ విభాగంలో కాస్య పథకం సాధించింది.
● బాలుర విభాగంలో మోహన్ దుర్గా 200 మీ టర్ల, ఫ్రీ స్టైల్ 400 మీటర్లు విభాగంలో రెండు కాంస్య పథకాలు సాధించారు.
● అఖిల్ చారి 50 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్లు బటర్ ఫ్లై విభాగంలో కాంస్య పథకాలు సాధించారు.


