కస్తూర్బాల నిర్వహణకు నిధులేవీ? | - | Sakshi
Sakshi News home page

కస్తూర్బాల నిర్వహణకు నిధులేవీ?

Nov 16 2025 11:14 AM | Updated on Nov 16 2025 11:16 AM

ప్రొసీసిడింగ్‌లు అందించాం..

జిల్లాలో 27 విద్యాలయాలు..

మోర్తాడ్‌(బాల్కొండ):కస్తూర్బా విద్యాలయాల ని ర్వహణకు నిధులు కరువయ్యాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ప్రభు త్వం నుంచి నిధులు రాకపోవడంతో విద్యాలయా ల ప్రత్యేకాధికారులే సొంతంగా ఖర్చు చేస్తూ, ప్రభుత్వానికి బిల్లులు పెడుతున్నారు.కానీ ప్రభుత్వం బి ల్లులను చెల్లించడంలోనూ జాప్యం చేయడంతో ప్ర త్యేకాధికారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పలువురు అధికారులు అప్పులు చేసి వి ద్యాలయాలకు ఖర్చులు చేయడంతో నిధులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయామంటున్నారు.

ఎంత ఖర్చు చేసినా రూ.10వేలే..

కస్తూర్బాల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులు ఎంత ఖర్చు చేసినా రూ.10వేలు మాత్రమే మంజూరు చేస్తామని ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. జూన్‌ నెలకు సంబంధించి రూ.4వేలు, ఆ తరువాతి నెలలకు రూ.10వేల చొప్పున మంజూరు చేస్తామని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయని పలువురు ప్రత్యేకాధికారులు ‘సాక్షి’తో చెప్పారు. పాఠశాలలకు పాత భవనాలు ఉన్నచోట నిర్వహణ ఖర్చులు అధికంగా ఉన్నాయని అలాంటి సమయంలో తక్కువ మొత్తంలోనే బిల్లులు మంజూరి చేస్తే తాము ఆర్థిక భారం మోయాల్సి వస్తుందని ప్రత్యేకాధికారులు వాపోతున్నారు. తమ మొరను ప్రభుత్వం గుర్తించేలా ప్రత్యేకాధికారులు ఉన్నతాధికారుల ద్వారా లేఖను పంపాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించి నిధులు వెంటనే విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.

ఏర్గట్లలోని కస్తూర్బా పాఠశాల భవనం

కస్తూర్బా పాఠశాలలకు సంబంధించి కొంత మేర నిధులు మంజూరు అయ్యాయి. బిల్లులు చేయాలని ప్రత్యేకాధికారులకు ప్రొసీడింగ్‌లను అందించాం. తొందరలోనే ప్రత్యేకాధికారులకు డబ్బులు చేతికి అందుతాయి. –భాగ్యలక్ష్మి, జీసీడీవో

జిల్లాలో 27 కస్తూర్బా పాఠశాలలు ఉండగా వాటిలో ఇంటర్‌ విద్య అమలవుతున్న విద్యాలయాలు 15 ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో సుమారు 380 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పదో తరగతి వరకు ఉన్న పాఠశాలలు 12 ఉండగా, ఒక్కో విద్యాలయంలో సుమారు 260 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఆయా కస్తూర్బాలకు బియ్యం పౌర సరఫరాల శాఖ, ఇతర నిత్యావసర సరుకులను కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేయిస్తున్నారు. సిలెండర్లను మాత్రం స్థానిక ఏజెన్సీల ద్వారానే ప్రత్యేకాధికారులు కొనుగోలు చేయాల్సి ఉంది. మొదట్లో ప్రభుత్వం ఏజెన్సీలకు అడ్వాన్సులు చెల్లించి సిలెండర్లను సరఫరా చేయించేది. ఈసారి పాఠశాలలు పున: ప్రారంభమైన సమయంలో అడ్వాన్సులు ఇవ్వకపోవడంతో ప్రత్యేకాధికారులే అప్పులు చేసి సిలెండర్లను కొనుగోలు చేశారు. ఒక్కో పాఠశాలకు ప్రతి నెలా మెయింటెనెన్స్‌ కోసం రూ.10వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చులు అవుతున్నాయి. విద్యుత్‌, నీటి సరఫరా, చిన్నచిన్న మరమ్మతులు, బియ్యం రవాణా, విద్యార్థులకు వైద్యం ఇలా ఎన్నో రకాల వాటికి ఖర్చులుంటాయి. కానీ నిధులు రాకపోవడంతో ప్రత్యేకాధికారులు సొంతంగా డబ్బులు చెల్లించి బిల్లుల రూపంలో సొమ్మును తీసుకుంటారు. ఒక్కో కస్తూర్బా పాఠశాల ప్రత్యేకాధికారికి గడచిన జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకూ రూ.2 లక్షల నుంచి రూ.2.50లక్షల వరకూ బిల్లులు మంజూరి కావాల్సి ఉంది. ఇలా జిల్లాకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.65లక్షలకు పైగా బిల్లులు మంజూరు కావాల్సి ఉంది.

జిల్లాలోని ఓ కస్తూర్బా పాఠశాల ప్రత్యేకాధికారి విద్యాలయం నిర్వహణ కోసం జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకూ రూ.85వేల వరకు ఖర్చు చేసింది. అలాగే సిలిండర్ల కొనుగోలు కోసం రూ.1.35లక్షల వరకూ ఖర్చుచేసింది. ఆ ప్రత్యేకాధికారి మొత్తం రూ.2.20లక్షలు ఖర్చుచేయగా, బిల్లులు చేసి ప్రభుత్వానికి పంపించింది. కానీ ఐదు నెలలుగా ప్రభుత్వం బిల్లుల కోసం నిధులు విడుదల చేయకపోవడంతో ఆమె చేసిన అప్పుకు వడ్డీ భారం మోస్తోంది. ఇది ఒక్క కస్తూర్బా పాఠశాల ప్రత్యేకాధికారికి జరిగిన ఇబ్బందే కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కస్తూర్బా పాఠశాలల ప్రత్యేకాధికారులది ఇదే పరిస్థితి.

ప్రస్తుత విద్యాసంవత్సరానికి

మెయింటెనెన్స్‌ ఖర్చులను

ఇప్పటికీ ఇవ్వని ప్రభుత్వం

ప్రత్యేక అధికారులే సొంతంగా

ఖర్చుపెడుతున్న వైనం

బిల్లులను చెల్లించడంలోనూ

ప్రభుత్వ జాప్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement