మాతృ మరణాలను అరికట్టాల్సిందే
● ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు
ఇంటింటి సర్వే నిర్వహించాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
నిజామాబాద్‌నాగారం: మాతృ మరణాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌వో) రాజశ్రీ అన్నారు. నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శనివారం ఆమె మాతృ మరణాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలో భవిష్యత్తులో మాతృ మరణాలు జరగకుండా చూడాల్సిందే అన్నారు. ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎంలు ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. ముందుగానే ప్రణాళికలు రచించుకొని సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. హైరిస్క్ కేసులను గుర్తించి ప్రత్యేక వసతులు ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స అందించాలన్నారు. ఆశ కార్యకర్తలు డెలీవరీ సమయంలో వెంట ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. ఎమ్‌సీహెచ్ శ్వేత, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


