నిజాయితీని చాటుకున్న మహిళ
● దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత
రామారెడ్డి: ఓ మహిళ తనకు దొరికిన పర్సును పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు అప్పగించి, నిజాయితీని చాటింది. వివరాలు ఇలా.. బాన్సువాడలోని మేకల సాయిసురేఖ ఇటీవల మండల కేంద్రంలోని కాలభైరవ స్వామి ఉత్సవాలకు వచ్చింది. శుక్రవారం రాత్రి ఆమె ఎక్కడో పర్సు పోగొట్టుకుంది. ఆ పర్సు కందూరి పెద్దలక్ష్మి అనే మహిళకు దొరికింది. లక్ష్మి పరుల సొమ్ము నాకెందుకని, దొరికిన పర్సును శనివారం పోలీస్‌స్టేషన్‌కె వెళ్లి ఎస్సై రాజశేఖర్‌కు అప్పగించింది. బాధితురాలు పర్సు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అదే సమయానికి వెళ్లింది. కానీ అప్పటికే ఆ పర్సు పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఎస్సై పర్సును, అందులోని రూ.20వేలనగదును బాధిత మహిళ కు అప్పగించారు. నిజాయితీగా పర్సును పోలీసులకు అప్పగించిన పెద్దలక్ష్మిని సన్మానించి అభినందించారు.


