నాణ్యమైన ఫర్నిచర్‌ను విక్రయిస్తున్నాం
నిజామాబాద్ రూరల్: నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ షోరూంలో నాణ్యమైన ఫర్నిచర్‌ను విక్రయిస్తున్నట్లు సంస్థ స్థాపకులు కొండ వీరశేఖర్ గుప్తా తెలిపారు. సోమవారం షోరూంలో 50 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. షోరూంలో ప్రత్యేక పూజలు చేశారు. 1975లో దేవీరోడ్డులో స్థాపించామని, 2009లో వినాయక్‌నగర్‌లో అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు తక్కువ ధరల్లోనే ఫర్నిచర్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొండ శ్రవణ్, పవన్, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేసినటువంటి పద్ధతులను జిల్లాలో కూడా తీసుకురావాలని ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యాలయాన్ని జిల్లా పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్లు పాల్గొన్నారు.
పాఠశాలలో
ఆకతాయిల వీరంగం
వేల్పూర్: మండలంలోని జాన్కంపేట్ ప్రైమరీ స్కూల్‌లో ఆదివారం అర్ధరాత్రి ఆకతాయిలు మద్యం సేవించి వీరంగం సృష్టించారని స్థానిక వీడీసీ సభ్యులు పేర్కొన్నారు. ఆకతాయిలు స్కూలు వరండాలో మద్యం సేవించి, విచ్చలవిడిగా మద్యం సీసాలు పగుల గొట్టారన్నారు. సోమవారం ఉదయం స్కూలుకు వెల్లిన టీచర్లు, విద్యార్థులు వరండాలో మద్యం సీసీలు చూసి బెదిరిపోయారన్నారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
నాణ్యమైన ఫర్నిచర్‌ను విక్రయిస్తున్నాం
నాణ్యమైన ఫర్నిచర్‌ను విక్రయిస్తున్నాం


