క్రైం కార్నర్
బోధన్‌టౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ వెంకట నా రాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మున్సిపల్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రాజం నాగమణి(37) స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం ఉదయం విధులు నిర్వహిస్తోంది. బోధన్ నుంచి బాన్సువాడ వైపునకు వెళ్తున్న సంగారెడ్డి జిల్లా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆమెను ఢీకొన్నది. ఈ ఘటనలో ఆమె కాళ్లు నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికులు, తోటి కార్మికులు ఆమెను చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు నిజామాబాద్‌కు తరలించాలని సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి ..
నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ఓ హోటల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. హోటల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి సోమవారం పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వయస్సు 55 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతుడి వివరాలు తెలిపిన వారు 8712659 714 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
రైల్వేస్టేషన్ ప్రాంతంలో మరొకరు..
నిజామాబాద్ అర్బన్:నగరంలోని రైల్వేస్టేషన్ కమాన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. మృతుడి వివరాలు తెలిపిన వారు 8712659714 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
రుద్రూర్: రెండు నెలల క్రితం అదృశ్యమైన వృద్ధుడు మంజీరా నదిలో మృతదేహమై కనిపించాడు. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ మండలం కారేగాం గ్రామానికి చెందిన పందిరి బుడ్డ చిన్నబోయి(64) అనే వృద్ధుడు కనిపించడం లేదని అతని కుమార్తె ఆగస్టు 31న కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం సుంకిని శివారులోని మంజీరా నదిలో మృతదేహం ఉన్నట్లుగా సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. మృతదేహం చిన్నబోయిగా గుర్తించారు. కాలకృత్యాల కోసం మంజీరా నది వైపు వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి ఉంటాడని మృతుడి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


