 
															రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన సాయిలు శనివారం బైక్‌పై కామారెడ్డికి బయలుదేరాడు. ముస్తాపూర్ శివారులో అతడి బైక్, లింగంపేట వైపునకు వస్తున్న కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయిలు కాలు విరిగినట్లు తెలిపారు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలో వినాయక్‌నగర్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. డిచ్‌పల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆకాష్ కొన్నిరోజులుగా వినాయక్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతడు ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం, ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో గొడవలు జరగాయి. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది, శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
కంటైనర్ బోల్తా
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం (బి) వద్ద ఓ కంటైనర్ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి పార్సిళ్ల లోడ్‌తో కంటైనర్ నిజామాబాద్‌కు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున మండలంలోని ధర్మారం (బి) వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు.
 
							రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
 
							రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
