గోదావరిలోకి కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను చేపడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 22154 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి 4 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కా లువ ద్వారా 4వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 4వేల క్యూసెక్కులు, సరస్వతి కా లువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు)అడుగులతో నిండుకుండలా ఉంది.
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని దత్తాపూర్‌లో రైతులు సాగు చేస్తున్న ఆర్‌డీఆర్–1200 రకం వరి పంటలను శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశీలించారు. క్షేత్ర సందర్శనలో భాగంగా వారు గ్రామాన్ని సందర్శించి ‘నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్ నాగరాజు సాగు చేసిన వరి పొలాన్ని పరిశీలించారు. ఆర్‌డీఆర్–1200 రకం వరి సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వచ్చిన దిగుబడిని విత్తనాలుగా కూడా ఉపయోగించవచ్చన్నారు. రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలిచ్చారు. శాస్త్రవేత్తలు రమ్య రాథోడ్, చంద్రకళ, ఎంఏవో మధుసూదన్, ఆదర్శరైతు చిన్న భూమన్న ఉన్నారు.
నిజామాబాద్‌అర్బన్: అమరుడైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని శనివారం బోఽ దన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఎవరైన పోలీసులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. నుడా చైర్మన్ కేశవేణు, నాగేష్‌రెడ్డి, నరాల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.
గోదావరిలోకి కొనసాగుతున్న నీటి విడుదల


