ఐకేపీ సిబ్బందికి ఆడిట్‌పై అవగాహన
డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీ సిబ్బందికి శనివారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆడిట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ఐకేపీ ఉద్యోగులు హాజరయ్యారు. హైదరాబాద్ సెర్ప్ నుంచి వచ్చిన చీఫ్ ఆడిట్ ఆఫీసర్ ఎంవీ క్రిష్ణ సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ సంఘం, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు ఏవిధంగా చేస్తే సంస్థల ఆర్థిక పరిస్థితి, రికవరీ, అడ్వాన్స్‌లు వస్తాయో వివరించారు. ఆడిట్‌లో వచ్చిన అభ్యంతరాలను డీఆర్‌డీవోకు ప్రతి నెలా పంపాలని సూచించారు. మూడు జిల్లాల డీఆర్‌డీవోలు సాయాగౌడ్, విజయలక్ష్మి, సురేంధర్, ఏపీడీ మధుసూదన్, ఫైనాన్స్ డీపీఎం కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


