38 బడులకు ఫైవ్‌స్టార్ రేటింగ్
కమ్మర్‌పల్లి: స్వచ్ఛతకు పెద్దపీట వేసేందుకు కేంద్రప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి అవగాహన కా ర్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలో స్వచ్ఛతలో మెరుగ్గా ఉండే బడులకు ‘స్వచ్ఛ ఏవమ్ హరి త విద్యాలయ రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్)’ పేరుతో ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లా లోని సుమారు 1812 ప్రభుత్వ, ప్రయివేటు బడులు ఆన్‌లైన్ ప్రక్రియలో పాల్గొనగా, 38 పాఠశాలలు ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించాయి.
6 విభాగాలు.. 60 ప్రశ్నలు..
స్వచ్ఛతకు సంబంధించిన ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని అందులోనుంచి 60 ప్రశ్నలను ఆన్‌లైన్ ప్రక్రియలో ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రయివేట్ బడుల హెచ్‌ఎంలు తాగునీరు, మరుగుదొడ్లు, చేతు ల శుభ్రత, బడి ఆవరణ శుభ్రత నిర్వహణ, ప్రవర్తన మార్పు, మంచి అలవాట్లు, విద్యార్థుల నడవడిక, ఎకో క్లబ్ ఏర్పాటు లాంటి ఆరు విభాగాల్లోని 60 ప్రశ్నలకు ఆన్‌లైన్ ద్వారా సమాధానాలు సమర్పించారు. ఇందుకు అవసరమైన ఫోటోలు అప్‌లో డ్ చేశారు. వాటిల్లో మెరుగ్గా ఉండే వాటికి మార్కు ల ఆధారంగా కేంద్రం వాటిని ఎంపిక చేసింది.
జాతీయస్థాయిలో 200 పాఠశాలలు..
జిల్లాల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ప్రత్యేక బృందం భౌతిక పరిశీలన చేసి ప్రతి జిల్లా నుంచి 8 పాఠశాలల(గ్రామీణ ప్రాంతం నుంచి ఆరు, పట్టణ ప్రాంతం నుంచి రెండు)ను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయస్థాయికి ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేసి అవార్డు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న పాఠశాలలకు దేశ రాజధాని ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేస్తారు. రూ. 1లక్ష స్కూల్ గ్రాంట్‌గా ఇస్తారు. 200 ఉత్తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను జాతీయస్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్‌పోజర్ విజిట్(క్షేత్ర సందర్శన)కు తీసుకెళ్తారు.
కోనాపూర్ జెడ్పీహెచ్‌ఎస్
స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌లో కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎకో క్లబ్ సభ్యులు ప్రతిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతారు. ఉపాధ్యాయులు, గ్రామస్తుల నిరంతర సహకారంతో రేటింగ్ సాధ్యమైంది. రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావడానికి కృషి చేస్తున్నాం. – రామ్‌ప్రసాద్,
హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, కోనాపూర్
స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ ద్వారా విద్యార్థుల్లో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన పెరుగుతుంది. ఫోర్, త్రీ స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలు లోపాలను సవరించుకొని వచ్చే విద్యా సంవత్సరంలో ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం కోసం కృషి చేయాలి. జిల్లాలో 1812 పాఠశాలలు ఆన్‌లైన్‌లో స్వీయమదింపు చేసుకోగా, 38 పాఠశాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది. – అశోక్, డీఈవో నిజామాబాద్
జిల్లాలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన బడులు ఇవే..
జెడ్పీహెచ్‌ఎస్ కోనాపూర్, గీతాంజలి హై స్కూల్ గోన్‌గొప్పుల, జెడ్పీహెచ్‌ఎస్ సుద్దపల్లి, ఎంపీపీఎస్ లింగాపూర్, ఎంపీయూపీఎస్ ఎంఎస్‌సీ ఫారం, ఎంపీపీఎస్ పత్తేపూర్, ఎంపీపీఎస్ మావండికలాన్, ఎంపీపీఎస్ వివతండా, ఎంపీపీఎస్ శాంతినగర్, కృషి హైస్కూల్ భీమ్‌గల్, జెడ్పీహెచ్‌ఎస్ దోన్కల్, జెడ్పీహెచ్‌ఎస్ కోమన్‌పల్లి, చైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాల బోధన్, లిటిల్ నేషనల్ స్కూల్ ఆర్మూర్, ఎంపీయూపీఎస్ అంబం(ఆర్), ప్రెసిడెన్సీ హైస్కూల్ నిజామాబాద్ నార్త్, విశ్వశాంతి విద్యానికేతన్ నిజామాబాద్, ఎంపీపీఎస్–గాంధీనగర్ సిర్నాపల్లి, కేజీబీవీ నందిపేట్, పీఎంశ్రీ టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ నిజామాబాద్, క్రిష్ణవేణి హైస్కూల్ భీమ్‌గల్, విజ్ఞాన్ హైస్కూల్ నిజామాబాద్, జెడ్పీహెచ్‌ఎస్ బోర్గాం(పి), జెడ్పీహెచ్‌ఎస్ మోస్రా, ఎంపీపీఎస్ జక్రాన్‌పల్లి, పీఎంశ్రీ టీజీఎంఎస్ ధర్పల్లి, పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ జానకంపేట్, ఎంపీపీఎస్ ఆరేపల్లి, ఎంపీపీఎస్ నవనాథపురం, ఎంపీపీఎస్ సుర్భిర్యాల్, నెహ్రూ యూపీఎస్ నిజామాబాద్, పీఎంశ్రీ టీజీఎంఎస్ సిరికొండ, శ్రీజాహ్నవి హైస్కూల్ బోధన్, వివేక్ యూపీఎస్ నిజామాబాద్ నార్త్, ఎంపీపీఎస్ చేంగల్, ఎంపీపీఎస్ మల్లాపూర్, ఎంపీపీఎస్ మినార్‌పల్లి, ఎంపీపీఎస్ ఏర్గట్ల.
స్వచ్ఛతలో మెరుగైన ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లకు స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ ప్రకటించిన కేంద్రం
ఇటీవల ఆన్‌లైన్ ప్రక్రియలో పాల్గొన్న జిల్లాలోని 1812 పాఠశాలలు
38 బడులకు ఫైవ్‌స్టార్ రేటింగ్
38 బడులకు ఫైవ్‌స్టార్ రేటింగ్
38 బడులకు ఫైవ్‌స్టార్ రేటింగ్


