మఠంరాళ్ల తండాలో ఆదిమానవుల ఆనవాళ్లు !
మీకు తెలుసా..
మాచారెడ్డి: మండలంలోని ఎల్లంపేట పరిధిలోని మఠంరాళ్ల తండాలో ఆదిమానవుల ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అందరినీ అబ్బురపరుస్తున్నాయి. గుహలో రాళ్లపై ఎరుపురంగులో చిత్రాలున్నాయి. ఈ తండా వాసి, కాకతీయ యూని వర్సిటీ పరిశోధక విద్యార్థి లింగం, మరో పరిశోధక విద్యార్థి జైనథ్‌కుమార్ ఈ రాతి చిత్రాలను చూసి బయటి ప్రపంచానికి పరిచయం చే శారు. అంతకుముందు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడైన కేపీఆర్ ఆ గుహ ను సందర్శించారు. గుహలో ఉన్న రాతిపనిము ట్లు, చిత్రాలను ఫోటోలు తీసుకువెళ్లారని స్థాని కులు తెలిపారు. అనంతరం కొత్త తెలంగాణ చ రిత్ర బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, సహాయకుడు నాగరాజుతోపాటు కవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ లు ఆదిమానవులు వాడిన పాత రాతి యుగపు పనిముట్లను పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి ఆదిమానవుల కాలం నాటి ఆనవాళ్లను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
మఠంరాళ్ల తండాలో ఆదిమానవుల ఆనవాళ్లు !


