 
															చికిత్స పొందుతూ ఒకరు..
జక్రాన్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. జక్రాన్‌పల్లి ఎ స్సై మాలిక్ రహమాన్ తెలిపిన వివరా లు ఇలా.. మండలంలోని అర్గుల్ గ్రా మానికి చెందిన ఆరెళ్ల కాశీరాం (60) ఈనెల 24న రాత్రి అర్గుల్ నుంచి హెచ్ పీ పెట్రోల్ పంపు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో వెనుక నుంచి వచ్చిన బైక్ కాశీరాంను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాశీరాంకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బోధన్ పట్టణంలో..
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కవిలేశ్వర్ శివకృష్ణ (35) ఫోటో స్టూడియోతోపాటు మిల్క్ డెయిరీ, బేకరీ బిజినెస్ చేసేవాడు. వ్యాపారాల నిమిత్తం అతడు మిత్రు ల వద్ద, బంధువుల వద్ద అప్పులు చేశాడు. దీంతో అప్పులు చెల్లించలేక జీవితంపై విరక్తి చెంది అతడు గురువారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే భార్య సంధ్యారాణి గమనించి అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని సీఐ వెల్లడించారు.
ఖాజాపూర్‌లో జీపీ కార్మికుడు..
బోధన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జీపీ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. సాలూర మండలంలోని ఖాజాపూర్ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ శేరే నాగ్‌నాథ్(39) శుక్రవారం రాత్రి రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించుకునేక్రమంలో పక్కనున్న కాలువలో పడి గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. అంత్యక్రియల కోసం గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.10వేల నగదు సహాయాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మద్దిలేటి, పంచాయతీ కార్యదర్శి శైలజ మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
