
రోడ్డు ప్రమాదంలో స్నేహితుడి మృతి.. తట్టుకోలేక ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలో ని జంగంపల్లి గ్రామశివారులో జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, తట్టుకోలేక స్నేహితుడు ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఎస్సై అంజనే యులు తెలిపిన వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన మంగలి పెద్ద నర్సింలు (60) సోమవారం గ్రామానికి చెందిన కొమ్మ భాస్కర్‌తో కలిసి, బైక్‌పై గ్రామంలోని శ్రీ కృష్ణమందిరానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వారు రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వా రిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, నర్సింలును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
ఇదిలా ఉండగా జంగంపల్లి గ్రామానికి చెందిన హరి భూమయ్య(58), మంగలి పెద్ద నర్సింలు ఇద్దరూ ప్రాణస్నేహితులు. నర్సింలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం హరి భూ మయ్యకు తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యా డు. ఈక్రమంలో విపరీతంగా మద్యం తాగి, సో మవారం రాత్రి ఇంటికి వచ్చాడు. మళ్లీ మంగళ వారం ఉదయం కూడా విపరీతంగా మద్యం తాగడంతో భూమయ్యను భా ర్య గౌరవ్వ ప్రశ్నించింది. వెంటనే అతడు పొలం వ ద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంత రం పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చే సుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి, వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూ మయ్య స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

రోడ్డు ప్రమాదంలో స్నేహితుడి మృతి.. తట్టుకోలేక ఆత్మహత్య