
క్రైం కార్నర్
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని అంకోల్ తండాలో ఓ వృద్ధురాలు హత్యకు గురైందని ఎస్సై రాఘవేందర్ తెలిపారు.వివరాలు ఇలా.. తండాకు చెందిన రాధిబాయి(65) సోమ వారం ఇంట్లో ఒక్కరే ఉ న్నారు.ఈక్రమంలో ఆమె ఒంటిపై ఉన్న వెండి నగలను కాజేయడానికి తండా కు చెందిన మెగావత్ సవాయి సింగ్ ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలి నుంచి తలుపులు వేసి వృద్ధురాలిపై దాడి చేసి, ఒంటిపై ఉన్న వెండినగలు దోచుకొని పారిపోయాడు. వెంటనే స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో దుండగుడు వారిని ఎవరికై న చెబితే మీ అందరిని చంపుతామని బెదిరించాడు. తలకు తీవ్రగాయమైన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కొడుకు లాల్‌సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు సవాయి సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.
వృద్ధురాలి ఆత్మహత్య
మోపాల్: మండలంలోని ఎల్లమ్మకుంట గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన అంగోత్ సోనాబాయి (56) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ఆమెకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈనెల 18న కొడుకు శ్రీరామ్ మద్యం తాగవద్దని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సోనాబా యి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అనంతరం గ్రామ శివారులోని నీటికుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఆమె మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం అందించారు. కు టుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

క్రైం కార్నర్