
తాళం వేసిన ఇంట్లో చోరీ
వర్ని: మండలంలోని కూనిపూర్ గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గోవూరి సుజాత ఇటీవల ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. మంగళవారం తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమచారం అందించింది. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనకాల తలుపులు పగలగొట్టి ఇంట్లో చొరబడి 4 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలు, రూ. 30వేల నగదును ఎత్తుకెళ్లినట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
దుర్గామాత ఆలయంలో..
వర్ని: మండలంలోని అఫంధి ఫారం గ్రామంలోగల దుర్గామాత ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి నగదుతోపాటు 20 తులాల వెండి, 2 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు.