
పురాతన కట్టడాలు.. గత వైభవపు ఆనవాళ్లు
బాన్సువాడ రూరల్: ఆనాటి సంస్థానాధీశులు తమ ఆధీనంలోని రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి కాపాడుకునేందుకు కాపాలా కోసం పెద్ద పెద్ద బు ర్జు(గడీ)లను నిర్మించారు. వృత్తాకార, చతురస్రాకార, దీర్ఘచతురస్రాకారాల్లో బురుజులను బండరా ళ్లు 20 నుంచి 25 మీటర్ల ఎత్తులో మట్టి, సున్నంతో కలిపి నిర్మించారు. వీటిపైకి ఎక్కడానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వెళ్లడానికి మార్గం ఉంటుంది. వీటిపై నుంచి చూస్తే గ్రామ పోలిమేరలు స్పష్టంగా కనిపిస్తాయి. బురుజుల పై భాగంలో చుట్టూ రంధ్రాలుండే రాళ్లతో కూడిన కట్టడం ఉంటుంది. వీటిలో నుంచి సైన్యం తుపాకులను శత్రు సైన్యంపై ఎక్కు పెట్టేవారని పూర్వీకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పాతబాన్సువాడ, బండగల్లీతో పాటు దేశాయిపేట్, పాత బాన్సువాడ, పోచారం, రాంపూర్, ఇబ్రహీంపేట్, బోర్లం, హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్ తదితర గ్రామాల్లో ఇప్పటికి బుర్జులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దసరా పండుగ నాడు వీటిపై జెండాలు ఎగురవేస్తారు. పోచారం గ్రామంలో ప్రతిఏటా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తమ ఇంటి ఆవరణలో ఉన్న బురుజుపై ఉన్న దస్తగిర్ దర్గాలో ఆనవాయితీగా ప్రార్థన చేసి దసరా ఉత్సవాలను ప్రారంభిస్తారు.