మాచారెడ్డి : చుక్కాపూర్‌లో విజయదశమి సందర్భంగా లక్ష్మీ నర్సింహస్వామి చక్కెర తీర్థోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అటవీ ప్రాంతంలో ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగింపుగా గ్రామానికి తరలించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి రథం ముందు చక్క భజనలతో పాటు చక్కెరను పంచిపెట్టారు. చక్కెర తీర్థం సందర్భంగా భక్తులు వారి కోరికలు తీరిన అనంతరం చక్కెర పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలాకర్‌రెడ్డి, ఈవో ప్రభు, డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజిరెడ్డి, గ్రామ పెద్దలు ఉన్నారు.
దోమకొండ: దసరా పండుగ సందర్భంగా గురువారం దోమకొండ బురుజుపై జాతీయ జెండాను ఎగురవేశారు. విజయదశమి ఆనవాయితీ ప్రకారంగా ముందుగా గ్రామ శివారులో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చావిడి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ గ్రామ ప్రత్యేకాధికారి ప్రవీవ్‌కుమార్‌తో బురుజుపై జాతీయ జెండాను ఎగురవేశారు. చాముండేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ సిద్దారెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ ఐరేని నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుంచాల శేఖర్, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని ఆర్య సమాజ్ భవనంలో దసరా సందర్భంగా గురువారం ఓంకార జెండాను ఆర్య సమాజ అధ్యక్షుడు పడిగల విజయకుమార్ ఉపాధ్యక్షులు నాజోజు శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఓంకా జెండాను పట్టుకుని గ్రామ పురవీధుల గుండా ఓంకార నానార్ నినాదాలు చేస్తూ ఊరేగించారు. విజయదశమి రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా ఓంకార జెండాను ప్రతి సంవత్సరం విజయదశమి రోజు ఆవిష్కరిస్తామని తెలిపారు.
ఘనంగా చక్కెర తీర్థం
ఘనంగా చక్కెర తీర్థం