
దశావతారాల్లో సర్వమంగళ..
సర్వమంగళ ప్రదాయిని, జగజ్జనని దశావతారాల రూపంలో చిన్నారులు ఆకట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గోనెరెడ్డి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం ఆవరణలో నెలకొల్పిన దుర్గామాత మండపంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనం ఇవ్వగా, చిన్నారులు అమ్మవారి దశావతారాలను ప్రదర్శించారు. సాయంత్రం మండపం వద్ద హోమం, కుంకుమార్చన నిర్వహించారు. భవానీ మాలధారులు అంతిరెడ్డి విజయపాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రామ్‌రెడ్డి, సాయిరెడ్డి, సాగర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – నిజామాబాద్ రూరల్