
స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్ట ర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమ వారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్‌తోపాటు సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమై ఉన్నా మని ఈ సందర్భంగా కలెక్టర్ కమిషనర్‌కు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించనున్నామన్నారు. మొత్తం 545 గ్రామ పంచాయతీలకు గాను తొలి విడతలో 281, రెండో విడతలో 264 జీపీల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ సిబ్బందిని నియమిస్తూ, వారికి మలివిడత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నామన్నారు.
వీసీ అనంతరం నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ మా ర్గదర్శకాలను పాటిస్తూ స్థానిక ఎన్నికలను ప్ర శాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సందేహాలు ఉంటే పైస్థాయి అధికారులను సంప్రదించి ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్‌రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.