
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
● బోధన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు
సుదర్శన్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి
● అంకాపూర్‌లో డబుల్ బెడ్రూం
గృహ ప్రవేశాలు
ఆర్మూర్ : పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బోధన్, ఆర్మూర్ ఎమ్యె ల్యేలు సుదర్శన్‌రెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రవేశాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 92 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పత్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యేలు అందజేశారు. అనంతరం అంకాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఆదర్శ గ్రామం అంకాపూర్ నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత గ్రామంలో ప్రత్యేక చొరవతోనే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ సాధ్యమైందన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అంకాపూర్ తరహాలో అన్ని నియోజకవర్గాల్లో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. అనంతరం అంకాపూర్‌లో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మో హన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డీఈ నివర్తి, ఆర్మూర్ ఎంపీడీవో శి వాజీ, తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు.