
వర్షానికి కూలిన ఇళ్లు
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో మేక లక్ష్మికి చెందిన ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతన ఇళళ్లు కావడంతో వర్షాలధాటికి దెబ్బతిని కూలింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. కాగా, గురువారం ఉదయం నుంచి భారీ వర్షం కురువడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. మక్క కోతలు కోసి నూర్పిళ్లు చేసి రోడ్లపై ఆరబెట్టారు. కొందరు రైతులు మక్క కంకులను కుప్పలు చేసి పెట్టారు. ఏకధాటి వర్షాలతో కుప్పలపై టార్ఫాలిన్లు కప్పి ఉంచారు. అయినా కంకులు తడిసి ముద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.