
పర్యాటకులకు అనుమతి నిరాకరణ?
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. వారిని పోచంపాడ్‌లోని జాతీయ రహదారి 44 వద్దనే అడ్డుకుంటున్నారు. ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు రావద్దని, పోలీసులకు సహకరించాలని మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని శుక్రవారం కోరారు. ప్రాజెక్ట్‌లోకి భారీ వరద రావడంతో ప్రాజెక్ట్ నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో ప్రమాదాలు సంభవించకుండ పర్యాటకులను జాతీయ రహదారి వద్దనే అడ్డుకుంటున్నారు. దీంతో పర్యాటకులు జాతీయ రహదారి 44పై సోన్ వంతెన వద్దకు వెళ్లి గోదావరి జలాలను తిలకిస్తు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.