
మంజీర తీరంలో ఇసుక లొల్లి
● సాలూరలో ఇసుక లోడ్ ట్రాక్టర్ల నిలిపివేత
బోధన్: మంజీర తీరంలో ఇసుక రవాణాపై వివా దం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో సాలూర మండ లం మందర్నా గ్రామ శివారులోని మంజీర నది నుంచి ఇసుక రవాణాకు రెవెన్యూ శాఖ అధికారులు అనుమతి ఇస్తున్నారు. దీంతో మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల ఓనర్లు లబ్ధిదారులకు ఇసుకను సరఫరా చేస్తున్నారు. తాజాగా బుధవారం రెవెన్యూ డి విజన్ పరిధిలోని ఎడపల్లి, కోటగిరి, పోతంగల్, బో ధన్ మండలాలకు చెందిన ట్రాక్టర్లు ఆయా మండలాల తహసీల్దార్ల నుంచి అనుమతి పత్రాలు తీసుకొని మందర్నా శివారులోని మంజీర నుంచి ఇసుకను తీసుకెళ్తున్నారు. ఇతర మండలాల ట్రాక్టర్లకు అధికారులు అనుమతి ఇవ్వడంతో వివాదం చోటు చేసుకుంది. సాలూర వద్ద ఇతర మండలాల ట్రా క్టర్లను స్థానిక ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నా రు. సాలూర తహసీల్దార్ శశిభూషణ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్ యజమానుల తో మాట్లాడారు. ఇసుక లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ల డ్రై వర్ల వద్ద అనుమతి పత్రాలను పరిశీలించారు. ఇతర మండలాల ట్రాక్టర్లకు అనుమతిపై ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ తెలిపారు. దీంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది.