
‘ఓపెన్ యూనివర్సిటీ’లో కొత్త కోర్సులు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆవరణలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(ఆర్‌సీసీ)లో 2025–26 సంవత్సరంలో కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రా మ్మోహన్‌రావు, ఆర్‌సీసీ కోఆర్డినేటర్ రంజిత తెలిపారు. కళాశాలలో మంగళవారం నిర్వహించిన విలే కరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరం నుంచి పీజీలో బీఎస్సీ–బాటనీ, కెమెస్ట్రీ, ఫిజిక్స్, బయోలాజీలతోపాటు బీఎల్‌ఐఎ స్‌సీ కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపా రు. వీటితోపాటు విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం నుంచి ఎస్‌టీఈపీ–(స్టైపెండ్ బేసెడ్ ఎడ్యుకేషన్ ప్రో గ్రాం– నెలకు రూ.7000 నుంచి రూ.24000) ప్రా రంభించినట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం, అత్యంత వెనుకబడిన వర్గాలైన కోయ, గోండు, ఎరుకల, ట్రాన్స్‌జెండర్ మొదలైన వారికి ఉచిత విద్య అందిస్తుందని ఆర్‌సీసీ కోఆర్డినేటర్ రంజిత తెలిపారు. ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత ధ్రువపత్రాలతో ఆర్‌సీసీని సంప్రదించాలని తెలిపారు. అనంతరం వాల్‌పోస్టర్లను ఆవిష్క రించారు. కళాశాల సీవోఈ భరత్‌రాజ్, ఆకాడమిక్ కోఆర్డినేటర్ నసీదాబేగం, అదనపు కంట్రోలర్లు వినయ్‌కుమార్, రాహుల్, ఆర్‌సీసీ సిబ్బంది ఉన్నారు.