
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
నిజామాబాద్ అర్బన్/మోపాల్: విద్యాలయాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా, తగిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలు, కళాశాలల పరిస్థితిపై మంగళవారం సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. దీనికి స్పందించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అంతేకాకుండా కంజర జ్యోతిబాపూలే పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. నూతనంగా నిర్మించిన డార్మెటరీ బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకరాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటిలోగా భవనం ఆధీనంలో తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు, సలహాలు చేశారు. ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డిచ్‌పల్లి మండలంలో..
డిచ్‌పల్లి: మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. విద్యార్థులు, హాస్టల్ అధికారితో ఆయన మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
కంజర జ్యోతిబాపూలే
విద్యాలయం తనిఖీ

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి