
గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా
ధర్పల్లి: జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలను చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకై ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్‌లు విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ధర్పల్లి సీఐ భిక్షపతి, ధర్పల్లి ఎస్సై కల్యాణి, సిరికొండ ఎస్సై రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.
టోల్‌ప్లాజా వద్ద అప్రమత్తంగా ఉండాలి
ఇందల్వాయి: టోల్ ప్లాజా వద్ద పోలీసులు అప్రమ త్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఉన్న టో ల్‌ప్లాజాని మంగళవారం ఆయన సందర్శించారు. ఎన్నో రాష్ట్రాల నుంచి వాహనాలు రాకపోకలు సా గించే వీలున్నందున టోల్‌ప్లాజా వద్ద పోలీసులు నిత్యం తనిఖీలు చేపట్టాలని సూచించారు. హైవేపై బ్లాక్‌స్పాట్‌ల చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.