
జెండా బాలాజీ ఆలయంలో పూజలు
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో సర్యసమాజ్ ప్రజా ఐక్య సమితి సభ్యులు సోమవారం జెండా జాతరకు సంబంధించిన బట్ట పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతరకు సంబంధించిన బట్టపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26న చిన్న జెండా, 27న పెద్ద జెండాను ఆలయ ఆవరణలో ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్వసమాజ్ అధ్యక్ష, కార్యదర్శులు కొట్టాల సుమన్, కర్తన్ దినేశ్, సర్వసమాజ్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.