
అలరించిన దాశరథి సంగీత విభావరి
నిజామాబాద్ రూరల్: సుమధుర పాటల కోవెల దాశరథి అని ప్రముఖ కవి వీపీ చందన్‌రావు అన్నారు. సోమవారం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గీతా భవన్‌లో స్వర సౌరభం ఆధ్వర్యంలో దాశరథి లలిత సినీ సంగీత విభావరి నిర్వహించారు. దాశరథి శతజయంతి వేడుకల్లో భాగంగా ఆయన రచించిన సుమారు 28 సినీ పాటలను గాయకులు ఆలపించినట్లు స్వర సౌరభం అధ్యక్షుడు అయాచితం నాగరాజు శర్మ తెలిపారు. అనంతరం పలువురు కవులకు పురస్కారాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో కాసర్ల నరేశ్ రావు, ప్రకాశ్, సముద్రాల రాంలు, వేముల శేఖర్, అనసూయ తదితరులు పాల్గొన్నారు.