
మహిళ ఫిర్యాదుపై స్పందించిన సీపీ
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం గేటు వద్ద ఓ మహిళ ఉండగా, సీపీ గమనించి ఆమె వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని రెండో పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన భామని సవి త తన సమస్యను విన్నవించడానికి సోమ వారం సీపీ కార్యాలయానికి వచ్చి గేటు వద్దనే వేచిఉంది. గమనించిన సీపీ సాయిచైతన్య ఆమె వద్దకు వచ్చి సమస్యను అడిగి తె లుసుకున్నారు. అదనపు కట్నం కోసం తన ను భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె సీపీకి తెలిపింది. సీసీ స్పందించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు.
నిలకడగా ఎస్సారెస్పీ నీటి మట్టం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో, ప్రాజెక్ట్ నుంచి ఔట్‌ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 608 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 277 క్యూసెక్కుల నీరుపోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1068.60(21.02 టీఎంసీలు) అడుగుల నీటి నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.
ఖర్గేకు శుభాకాంక్షలు
తెలిపిన షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్ : అఖిల భారత కాంగ్రెస్ క మిటీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదిన శుభాకాంక్ష లు తెలిపారు. ఖర్గేను సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో షబ్బీర్ మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగు చ్ఛం అందజేశారు.

మహిళ ఫిర్యాదుపై స్పందించిన సీపీ