
పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించాలి
మోపాల్ (నిజామాబాద్ రూరల్): పరిసరాల శు భ్రత పాటించేలా ప్రజలకు అవగాహన క ల్పించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ప క్కాగా అమలయ్యేలా చూడాలని అధికారుల ను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. జి ల్లాలో ఎక్కడ కూడా జ్వరాలు, సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. మండలంలో ని కాల్పోల్ తండాను కలెక్టర్ సోమవారం సందర్శించారు. తండాలో పలువురికి జ్వరా లు సోకిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యే క వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. జ్వరాలు, ఇతర అనారోగ్య కారణాలతో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. జ్వరం వచ్చిన వెంటనే స్థానికులు వైద్య శిబిరంలో తగిన చికిత్సలు పొందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా తండాలోని ఆయా నివాస ప్రాంతాలను సందర్శిస్తూ, స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించారు. పరిసరా లను శుభ్రంగా ఉంచుకోవాలని స్థా నికులకు సూచించారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి తుకారాం, డీపీవో శ్రీనివాస్, మోపాల్ ఎంపీడీవో రాములు, ఎంపీవో కిరణ్ తదితరులు ఉన్నారు.
● కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
● కాల్పోల్ తండాలో పర్యటన