
మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
నవీపేట: నవీపేట పోలీస్ స్టేషన్‌ను సీపీ సాయి చైతన్య సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ సెక్షన్, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై వీడీసీలకు అవగాహన కల్పించాలని నార్త్‌రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్‌లకు సూచించారు. గ్రామ పోలీస్ అధికారులు విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గంజాయి, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.