
ప్రాణాలు పోతున్నా పట్టింపేది..
నగరంలోని ఖలీల్‌వాడి, కోటగల్లి, పూసలగల్లి, గాయత్రినగర్, సాయిప్రియనగర్, శివాజీనగర్, ఆనంద్‌నగర్ కాలనీ, గాజుల్‌పేట్, వినాయక్‌నగర్, 100 ఫీట్ల రోడ్డు, దుబ్బ, అరుందతీనగర్ తదితర కాలనీల్లో ఎక్కువగా కుక్కలు సంచరిస్తున్నాయి. రాత్రి వేళ కుక్కలు గుంపులు గుంపులుగా చేరి రోడ్లుమీదకు వస్తున్నాయి. వాహనదారులు వెంటపడటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై దాడులు చేస్తున్నాయి. గత నెలలో మాలపల్లిలో కుక్కకాటుకు గురైన ఐదేళ్ల బాలుడు నెల తర్వాత మృతిచెందడం కలచి వేసింది .ప్రాణాలు పోతున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోజుకు 6 నుంచి ఏడు కుక్క కాటు కేసులు జీజీహెచ్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది.