
రేపటి విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి
నిజామాబాద్ అర్బన్: ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తూ బుధవారం చేపట్టే విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు నాగరాజ్ అన్నారు. సోమవారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలన్నారు. ఈ నిరసనలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు
హైమాస్ట్ లైట్ల ప్రారంభం
సిరికొండ: మండలంలోని రావుట్ల గ్రామంలో ఎమ్మెల్సీ కవిత మంజూరు చేసిన నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీఆర్‌ఎస్ నాయకులు ప్రారంభించారు. మాజీ వైస్ ఎంపీపీ తోట రాజన్న, మాజీ ఉపసర్పంచ్ రఘువాస్, వీడీసీ చైర్మన్ భూమయ్య, శ్రీనివాస్, రాజేందర్, పెద్ద భూమయ్య, మైసి సాయన్న,బాలరాజు, సాయిలు, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలపై
నిఘా పెంచాలి
సిరికొండ: మండల కేంద్రంలో మత్తు పదార్థాల విక్రయంపై నిఘా పెంచాలని ఎస్సై రామకృష్ణను సిరికొండ వీడీసీ సభ్యులు కోరారు. ఎస్సైని వారు సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. వాహనాల తనిఖీల్లో స్థానికులకు మినహాయింపు ఇవ్వాలని, పొలం వద్దకు వెళ్లే వారికి హెల్మెట్ లేదని జరిమానాలు విధిస్తున్నారని వీడీసీ సభ్యులు ఎస్సైకి తెలిపారు. వీడీసీ చైర్మన్ స్వామి, వైస్ చైర్మన్ రామస్వామి, మంగళి మోహన్, భూమరెడ్డి, లక్ష్మణ్, రాజలింగం, గంగాధర్, సంజీవ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ అర్బన్ : ఒడిస్సాలో అత్యాచారానికి పాల్పడిన ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శివ డిమాండ్ చేశారు. నగరంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడిస్సాలో ఎఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు ఉదిత్ ప్రధాన్ ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి పోలీసులకు లొంగిపోయాడన్నారు. ఈవిషయం సిగ్గ చేటన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత చారి, తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్, దినేష్, అల్తాఫ్, ఆకాష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 10 నుంచి
జలాల్ బుకారి దర్గా ఉర్సు
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని రెంజల్ బేస్‌లోగల జలాల్ బుకారి దర్గ ఉర్సు ఉత్సవాలు ఆగస్టు 10వతేదీ నుంచి సజ్జదే నశీ ముక్తెదార్, ఉర్సు కమిటీ ప్రధాన కార్యదర్శి యూనుస్ పటేల్ తెలిపారు. సోమవారం ఉర్సు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఉర్సు ఉత్సవాలు 10,11,12 మూడు రోజుల పాటు సాగుతాయని పేర్కొన్నారు.

రేపటి విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

రేపటి విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి