
తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు
నిజామాబాద్ సిటీ : నగరంలోని బహుజన కాలనీలో బండ పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు హాజరయ్యారు. బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ట్రానన్స్‌జెండర్స్ అసోసియేషన్ నాయకులు గంగ, జరీనా, రక్షలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. బోనాల ఊరేగింపు సందర్భంగా జోగిని సుచిత్ర విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బోనాలు నిదర్శనమన్నారు. ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ద్వారా ప్రజలు సుఖశాంతులతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రామర్తి గోపికృష్ణ, వేణురాజ్, పార్థసారథి, రాజేష్, మల్యాల గోవర్ధన్‌లతోపాటు బహుజన కాలనీవాసులు గంగ, జరీనా, రక్ష, మారుతి, అలీ, లక్ష్మీ, షాదుల్ ఖాన్‌లు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు