
గురువులు మార్గదర్శకులు
నిజామాబాద్ రూరల్ : నగరంలోని సంస్కార భారతి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలో సోమవారం ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులను, కళాకారులను సన్మానించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డిరాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషికి మార్గదర్శకులుగా గురువులు ఉంటారని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం
నిజామాబాద్ అర్బన్ : బీసీ రిజర్వేషన్లపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని, ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు అభినందనీయమని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవీటి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం నగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు పోరాటం చేస్తేనే ఫలితం దక్కిందన్నారు. ఆగస్టు 7న గోవాలో 10,000 మంది బీసీ ప్రతినిధులతో ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నారని, ఈసభలో బీసీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు మోహన్, గౌరవాధ్యక్షులు బాబు తదితరులు పాల్గొన్నారు.

గురువులు మార్గదర్శకులు