
ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి
నిజామాబాద్ సిటీ : అమెరికా యుద్ధోన్మాదం మానవాళికి చాలా ప్రమాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. యుద్ధోన్మాదుల చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఇటీవల సంగారెడ్డి వద్ద సిగాచీ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. ఆన్ స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడం దుర్మార్గమన్నారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకా రం చుట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యంచేసి నడిపించేందుకు నిరంతరం అధ్యయనం చేస్తుండాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రమేష్ బాబు, పెద్దివెంకట్రములు, నూర్జహాన్, పల్లపు వెంకటేశ్, శంకర్ గౌడ్, జంగం గంగాధర్, నన్నేసాబ్, కొండ గంగాధర్, సుజాత, విఘ్నేష్ పాల్గొన్నారు.