
కాన్షీరాం అడుగుజాడల్లో నడవాలి
నిజామాబాద్ నాగారం : బహుజనులు కాన్షీరాం అడుగుజాడల్లో నడవాలని రూరల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్‌చార్జి నీరడి లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన బహుజన సమాజ్‌వాదీ పార్టీ నిజామాబాద్ మండల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రూరల్ నియోజకవర్గం లో పార్టీని బలోపేతం చేయడానికి మండల కమిటీలు, గ్రామ కమిటీలు, సెక్టార్ కమిటీలు, బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు పోతే ప్రవీణ్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సున్నం నరేష్, నియోజకవర్గం కార్యదర్శి ప్రభుదాస్, నిజామాబాద్ మండల అధ్యక్షులు గడ్డం రవి, బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.