
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
ఆర్మూర్‌టౌన్: యువత చెడు వ్యసనాలు వీడి మంచి మార్గంలో నడవాలని స్వేరోస్ చైర్మన్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్‌హాల్ ఉమ్మడి జిల్లా స్వేరోస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు వైపు వెళుతున్న ఈ రోజుల్లో మనం కూడా వాటిని అందిపుచ్చుకొని గొప్పస్థాయికి రావాలని విద్యార్థులకు సూచించారు. ఆరోగ్య పరిరక్షణపై చిట్కాలు, ఆత్మహత్య నివారణ, అక్షరం, ఆర్థికం, ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బలుగురి దుర్గయ్య, వైస్ చైర్మన్ బాలప్రసాద్, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి, దేవన్న, జైపాల్, లక్ష్మణ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.